పరిచయం పరవశం,
ప్రేమ ప్రణయం.

క్షణమో కావ్యం,
కాలం కమనీయం.

భావాల బేధం,
అలుక అందం.

విరహం మూల్యం,
రాజి రమ్యం.

ఇదే ప్రేమ వృత్తాంతం.




ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

ప్రజధనం కొల్లగోట్టే ముటాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

అతివినయం చూపించే రాబంధువులు
పదవినియామకం కోసమేగా ఈ పకడ్బందీలు

రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.

పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.

మార్పుకోసమే ఎదురుచూసే పిచ్ఛిజనాలు,
ఏనాటికి జరగవవి, ఇవి పచ్ఛినిజాలు.


కనుల విలువ తెలియదు నీ అందం కనిపించేదాక,

కలల విలువ తెలియదు నీ ప్రతిబింబం చూపించేదాక.

కవిత విలువ తెలియదు నీ ప్రేరణ పొందేదాక,

కన్నీటి విలువ తెలియదు నీ విరహం కాంచేదాక.

అడుగు విలువ తెలియదు నీ తోడులో నడిచేదాక,

అలుక విలువ తెలియదు నీ బుజ్జగింపు తెలిసేదాక.

మధురం విలువ తెలియదు నా హృదయం ప్రేమించేదాక,

అధరం విలువ తెలియదు నీ చుబుకం అందుకునేదాక.

మగువ విలువ తెలియదు మనసు పారేసుకునేదాక,

మనసు విలువ తెలియదు మగువ దోచేసుకొనేదాక.





ప్రతిక్షణం ఆలోచనల ఆనందాలు,
మరుక్షణం వియాగాల ఆవేదనలు.

ఆప్యాయతలు లేని జ్ఞాపకాలు ఎడారులు,
కన్నీళ్ళు నిండిన కనులు కావేరులు.

కనులు రాసిన ప్రేమ కావ్యాలు,
పెదవి దాటని మౌన రాగాలు.

మనసు పెట్టే భాదలు,
మరపు చేసే ఓదార్పులు.

గతం మిగిల్చిన గాయాలు,
భవిష్యత్తు తెలిపే లక్ష్యాలు.

ఇవే నా ప్రేమప్రయాణపు మజిలీలు.