కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి

మనసు నన్ను మోసం చేసింది నన్ను వదిలేసి నిన్ను చేరి

చివరికి నువ్వు కూడ నన్ను మోసం చేశవు నన్ను ఒంటరిగా వదిలేసి

మరణాన్ని అడిగాను నన్ను కుడా నీ దగ్గరకు తీసుకుపొమ్మని

అది కూడ నన్ను మోసం చేసింది నిన్ను మాత్రమే తీసుకెళ్ళింది

బహుశా అది కూడ నాలాగ నిన్ను ప్రేమిస్తుందేమో అందుకే నిన్ను తనతొ తీసుకెళ్ళింది

వాదన పడ్డాను తనతో, నిన్ను తిరిగి పంపించమని

వేదన పడ్డను తను కుదరదని చెప్పినప్పుడు

వేదన వల్ల నేను పడ్డ ఆవేదన ఏనాటి కైనా తను అర్దం చేసుకుంటుందని,

నన్ను నీ దగ్గరకు చేరుస్తుందని ఎదురుచుస్తున్నాను, మరణం కోసం.

0 comments:

Post a Comment