రెప్పలు చాటున దాగిన అందంతో....
పెదవుల మాటున దర్శించిన దరహాసంతో....
చూసిన నిన్ను వర్ణిద్దామంటే మనసు మాటని మౌనం కప్పేస్తుంది....
రాసిద్దామంటే  భిడియమేదో అక్షరాన్ని ఆపేస్తుంది...

ఆశగా అడగగా మౌనం మన్నించి, భిడియాన్ని బంధించగా
హృదయబృంధావనం నుండి విరిసిన ఒకే ఒక్క భావపుష్పం

(నీ వికాసిత నయనాలతో నా మనసుని రమించిన ఓ చెలి,
ఒక్క సారి నీ మనొశికరం నుండి నా ప్రేమ సెలయేరుని జారనివ్వు....
ఆ ప్రేమజలపాతపు హోరులో నా గుండెచప్పుడు విను,
క్షణంకో కోటిసార్లూ నీ పేరే స్మరిస్తుంటుంది,
ప్రతి భిందువులోను నీ రూపే ప్రతిభింభిస్తుంది.)





ఆలోచనలను ఆక్రమించావు,
మనసుని మాయ చేశావు,
కనులను కప్పేశావు,
మాటను మౌనం చేశావు,

ఇది ప్రేమే కదా..

ఆలోచనలు ఆక్రమించావు ఆవేదనతో,
మనసుని మాయ చేశావు మోసంతో,
కనులని కప్పేశావు కన్నీటితో,
మాటను మౌనం చేశావు మరణంతో

ఇది ప్రేమేనా?
 మేఘం వర్షించలేదంటే నీరు లేదని కాదు
మనసు స్పందించలేదంటే ప్రేమ లేదని కాదు
చల్లని స్పర్శ ఏదో తమని తాకలేదని అర్ధం..

మాట పెదవి దాటలేదంటే గొంతు మూగబోయింది అని కాదు
కవిత కలం దాటలేదంటే మనసు మౌనమయింది అని కాదు
అసహనపు భావనేదో మనసుని కప్పేసిందని అర్ధం..

మనసుపై ఆ ముసుగుని తొలగిస్తూ....చల్లని మీ స్పర్శకై తిరిగి పరితపిస్తూ
                                                                             
                                                                                     మీ....
                                                                            (మనసులో కురిసిన వెన్నెల)





ప్రేమ ఎడారిలో ప్రయాణించాను, నీ చిరునవ్వులని చూసి....
అవి కవ్వించి...మోసంచేసే ఓయాసిస్సులే అని తెలియక.

ప్రతిక్షణం నీకోసం గడిపేశాను నీ ఓరచూపులు చూసి...
అవి మురిపించి...గుండెను కాల్చే జ్వాలలని గుర్తించలేక...

నన్ను విడిచిపోని నీడవని చెబితే ఆనందించాను...
ఆనందపు వెలుగులో తోడుండి...ఒంటరితనపు చీకటిలో విడిచిపోతవని ఆలోచించలేక....

స్వచ్చమైన కన్నీటి లాంటి ప్రేమ నీదంటే పొంగిపోయాను....
గుండెకు చిచ్చుపెట్టి, నేను రోధిస్తుంటే కనులనుండి జారిపోతావని గ్రహించలేక....

నీ గుండెలో చోటిస్తానని నా మనసుని దాచుకున్నావు...
ఇప్పుడు ఊపిరాడనీకుండా బయటపడనీకుండా బంధించి...నవ్వుకుంటున్నావా...

మనసుని......జీవాన్ని.....జీవితాన్ని కోల్పోయిన....నన్ను చూస్తూ.....








ఉదయించే సూర్యుడిలా....నా మనసులో నీ స్నేహం ప్రతిక్షణం ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటూ...

పరవళ్ళుతోక్కే నదిలా....నీ మాటలు నా మదిలో ఎప్పుడూ ప్రవహిస్తునే వుండాలని ఆకాంక్షిస్తూ.....

భువిపై చిందేసే వానచినుకులుగా,,,,నీ చిరునవ్వులు నా ఎదలో అనుక్షణం వర్షిస్తూ పరిమళించాలని ఆశిస్తూ.....

నమ్మకాన్ని పెంచే దేవుడిలా.....నువ్వు నింపే మనోధైర్యం నా గుండె గుడిలో ప్రతిమలా నిలిచిపోవాలని పరితపిస్తూ......



నీ ప్రియనేస్తం........









నిజమే నిన్ను వదిలేసాను....
నా ప్రేమను చంపేసాను...

నా ప్రేమ నిన్ను వేధిస్తుందని,
నా దూరం నిన్ను ఆనందింపచేస్తుందని.....

గతాన్నంతా కాల్చేసాను,
జ్ఞాపకాలన్ని చెరిపేసాను,....

సంవత్సరాలయినట్లుంది నిన్ను చూడక,
ఐనా ఆనందంగానే బ్రతికేస్తున్నాను,.....

యుగాలయినట్లుంది నీ స్వరం వినక,
ఐనా సంతోషంగానే జీవిస్తున్నాను......

కాని కనురెప్పలపై నీ రూపాన్ని చెరిపేయలేకున్నాను,
హృదయస్పందనలో నీ పేరుని మార్చలేకున్నాను.
గుండెలోతునుండి ఉభికి వస్తున్న కన్నీటి ప్రవాహన్ని ఆపలేకున్నాను..

ఐనా సరే నీ ఆనందం కోసం నీకు దూరంగా క్షణక్షణం మరణిస్తూ,
ప్రతి క్షణం (నీవులేని) నాదికాని ఈ  జీవితాన్ని గడిపేస్తాను...