నిజమే నిన్ను వదిలేసాను....
నా ప్రేమను చంపేసాను...
నా ప్రేమ నిన్ను వేధిస్తుందని,
నా దూరం నిన్ను ఆనందింపచేస్తుందని.....
గతాన్నంతా కాల్చేసాను,
జ్ఞాపకాలన్ని చెరిపేసాను,....
సంవత్సరాలయినట్లుంది నిన్ను చూడక,
ఐనా ఆనందంగానే బ్రతికేస్తున్నాను,.....
యుగాలయినట్లుంది నీ స్వరం వినక,
ఐనా సంతోషంగానే జీవిస్తున్నాను......
కాని కనురెప్పలపై నీ రూపాన్ని చెరిపేయలేకున్నాను,
హృదయస్పందనలో నీ పేరుని మార్చలేకున్నాను.
గుండెలోతునుండి ఉభికి వస్తున్న కన్నీటి ప్రవాహన్ని ఆపలేకున్నాను..
ఐనా సరే నీ ఆనందం కోసం నీకు దూరంగా క్షణక్షణం మరణిస్తూ,
ప్రతి క్షణం (నీవులేని) నాదికాని ఈ జీవితాన్ని గడిపేస్తాను...