నువ్వు "నన్ను మరిచిపో"మని చెప్పిన.....

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.

ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?

ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.

బాల్యం- బాహ్యప్రపంచపు వసంతంలో.. ఊహలు చిగురించే ప్రాయం.

యవ్వనం-ఎన్ని అడ్డుగోడలు నిలిచినా గమ్యం చేరే తిరుగులేని కిరణం

స్నేహం-తనజీవితాన్ని తీరంతో  పంచుకునే అలల బంధం.

ప్రేమ-ఇరుమనసుల శృంగారంలో ప్రసవించిన బంధం

పెళ్ళి- ఎండ,చిరుజల్లు అనే రెండు వేరువేరు జీవితాల కలయికలో విరిసిన హరివిల్లు.

సంతానం- అనురాగల వృక్షానికి పుష్పించన ప్రేమ కుసుమం.

వృధాప్యం-కాలభానుడి వేడికి వయసుసంద్రం ఆవిరై,మృత్యుమేఘపు అంచులు చేరబోయే ప్రాణజలం.

మరణం-కొత్తలోకంలొ ఉదయించడానికి అస్తమించిన జీవితం.







మనసు ఉదయంలేని.... చీకటి లోకం.... నిన్ను కలిసేదాక.
అలోచనలు అలుపెరగని అలలు.... నీ పిలుపుల తీరం చేరేదాక.

మొగ్గతోడిగిన పువ్వులా నిన్ను చూసి సిగ్గులొలకపోసే నా మనసు.
తిరుగులేని కిరణంలా నీ మనసుపై ప్రేమను ఎలా ప్రకాశింపచేసిందో....

అంగీకారభావంతో ఈ అరుణోదయాన్ని ఆహ్లాదపరుస్తూ నువ్వొస్తావని ఎదురుచూసూ..
నిన్ను కలిసిన ప్రతిక్షణాన్ని నా మనోజాబిల్లి చుట్టూ చుక్కలుగా పేరుస్తూ..

విసుగు చెందిన ఉదయం కూడ విధిని వదిలి వెళ్ళిపోయింది.
వెలుగు నిండిన ఆశ కూడా కనుల నుండి జారిపోయింది.

కలలు కన్నీళ్ళుగా అలల తోడు చేరి నన్ను ఒంటరిని చేస్తుంటే.
మనసు తనకు ప్రేమను పంచలేకపోయవని ఎగతాళిచేస్తుంటే..

వెళ్ళిపోతున్న ప్రియా నా కలలకు కళ్ళెంవేస్తూ,ఆ అలలకు ఎదురెళ్తూ.
నీ కనుల నుండి దూరంగా... ఈ లోకం నుండి శాస్వతంగా....
 
 
నా గుండెల్లొ దాచుకునే ఆనందాల ఐశ్వర్యం నీ స్నేహం.

నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం.

నా జీవనప్రయాణంలో అలసిపోయి సేదతీరే ప్రతి మజిలి నీ స్నేహం.

బాధలు నిండిన నా చీకటి జీవితంలో ఆనందాల వెన్నెల నీ స్నేహం.

పరిచాయలు ఎన్ని వున్న గుండెలో ప్రతిక్షణం వినిపించే స్పందన నీ స్నేహం.

                          నా ఆలోచనలకు, నా ఇష్టాలకు, నా చిరునవ్వులకు నిలువుటద్దం నీ స్నేహం.

                            ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..
 
 
 
నిను చూసిన మరుక్షణం నన్ను మరిచి నీవెంట నడిచే సమయాన,
ఈ మనసే నాది, అది వినే మాటే నీది.

కనులకు కమ్మిన నీ రూపం ప్రపంచాన్ని కప్పేస్తుంటే,
నా మనసే ఓ మాయ, నీ మాటే ఓ మంత్రం.

నీను చేరుకోవాలని నీలో కలిసిపోవాలనే ప్రయత్నంలో,
నా మాటే ఓ కెరటం, నీ మనసే నా తీరం.

నా ప్రేమను నీకు తెలియజేసే సమయానా,
నా మనసే ఓ మౌనరాగం, నీ మాటే నాకు అంగీకారభావం.

నీలో ఆ ప్రేమ లేదని తెలిసిన మరుక్షణాన,
నీ మాటే ఆయుధం, నా మనసే మానని గాయం.

అరవిరిసిన చిరునవ్వులు, అలరించిన చెలి చూపులు అబద్ధం అని తెలిసినప్పుడు,
నీ మనసే ఓ మోసం, నా మాటే ఇక మౌనం.







 
ఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,

నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!

ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!

గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!

ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!

ఒక్కమాటలో చెప్పలంటే-

"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".

అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".