ప్రేమికులకి రోజు ఏమిటి ?

ఈ రోజు ప్రేమించాలా? ఈ రోజు కలిసుండాలా?
ఈ రోజు ప్రదర్శించాలా? ఈ రోజు వ్యక్తం చెయ్యలా?

మరి తనని మొదటకలిసిన రోజేమిటి ? తను మొదటమాట్లాడిన రోజేమిటి ?
తన కళ్ళలో ప్రేమ చూసిన రోజేమిటి? తన మనసులో నన్ను చూసిన రోజేమిటి?

అంతకన్న ముఖ్యమైన రోజా.... అంతకన్న విలువైన రోజా?
అసలైనా ప్రేమికులకి ఒక రోజేమిటి.... ఒకరి పేరేంటి?

ఆలోచనల ఓపిరి ఉన్నంతవరకు ... ప్రేమ స్పందిస్తునే వుంటుంది...
అది రోజుతో కాదు ....మనసుతో ముడిపడి వుంటుంది....

నావరకు ప్రతిక్షణం ప్రేమికులక్షణమే.....




నా ప్రపంచంలో ఒక కొత్త మనిషి అని వినగనే ఏదో అలజడి...
కాని తనని చూడగానే అలా ఓ జడివాన కురిసింది మనసులో....

ఏదో తెలియని భిడియం...మనకు సరిపోతుందో లేదో అని...
కాని తన మాటలు మనకి చేరువగా..మనసుకి దగ్గరగా....

ఎలా వుందో చూడాలని ఆరాటం...అందరిలో చూడలేక మొహమాటం...
కాని మొదటిసారి తన కళ్ళని చూసిన ఆ నిమిషమే జరిగెను మనసుకి తనతో పరిణయం....
 
విభిన్న ఆలోచనలు..అభిరుచులు...అనుబంధాలు ఒకటవుతాయా అని అనుమానం...
మనసులు ఒకటైన క్షణం..అంతా మనం ...అంతా ఆనందం అని తానిచ్చిన ఓ నమ్మకం....

తనే.. ఆరోప్రాణంగా నాతో ఏడడుగులు వేసే నా ఆనందం...
తనే.. నా జీవితాంలో నేను పొందే అతి విలువైన "సిరి"సంపద....






ప్రతి అల ఒక పులకరింపులా ..ఒక కొత్త స్నేహంలా అలా పలకరించి వెళ్తుంటే
తీరం సెకనుకోకసారి పాదాలకి అభిషేకం చేస్తుంటే....
సముద్రపు హోరు ఒక కొత్త స్వరంలా మనసుని మీటుతుంటే....
అల్లంత దూరంలో ఆకాశం...నీరు కలిసిపోయి చుంభించుకుంటున్నట్లు ....
కాలం కూడ సంద్రంతో స్నేహం చేసిందేమో అన్నట్లు వేగం పెంచి ఘడియలు కూడ సెకనుల్లా గడిచిపోతుంటే...
వెనుతిరిగి వెళ్తుంటే ....అలలు కాళ్లకు బంధం వేస్తూ వెనక్కి లాక్కెళ్తున్నాయి...
సముద్రం అమ్మ ఒడిలా హక్కున చేర్చుకుంటే....
హోరుగాలి నాన్నలా జో...కొడుతుంటే.....
కనుల నుండి జారిన ఒక ఆనందభాష్పం...
బహుశా వాటికి నేనివ్వగల్గిన కానుక అదొక్కటేనేమో....




మనిషి మారిపోయింది, ప్రేమ ఓడిపోయింది,
కాలం కరిగిపోయింది, మనసు మోడుబారింది...


ఐనా గుండె మంట ఆరలేదే, కంట తడి ఆగలేదే
ఆలోచన ఆవిరవ్వలేదే.. కనీసం ప్రాణమన్న పోలేదే..

యంత్రమన్నా కాదే మనసు నియంత్రించడానికి...
మంత్రమన్నా రాదే మనసుని మాయచేయడానికి....


ఎన్నాళ్ళి నరకయాతన...
ఊపిరికూడా ఉప్పెనలా గుండెకి ఒత్తిడి పెంచుతుంది.
ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తుంది.
అందరూ వున్నా ఒంటరిగా అనిపిస్తుంది.
ప్రాణమున్న శవంలా వుంది పరిస్థితి.







ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు,

నువ్వు పరిచయం అయినప్పుడు.....
నా జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చిందని అనుకున్నాను కాని,
నువ్వే నా జీవితం అని అర్ధంచేసుకోలేకపోయాను.

నీ మాటలు ఆలకించానే కాని,
అందులోని మాధుర్యాన్ని ఆశ్వాధించలేకపోయాను
,

నీతో గడిన ప్రతిక్షణం ఆనందించానే కాని,
దూరమైతేగాని ఆ క్షణాల విలువ తెలుసుకోలేకపోయాను.

సిగ్గువిడిచి నీ ప్రేమను తెలిపినప్పుడు ఆహ్వానించలేకపోయా కాని,
నీ జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుండెను కోసేస్తుంటే ఆపలేకపోతున్నాను
.
నువ్వు వదిలివెళ్ళిన కొన్నాళ్ళు మరిచిపోయాననుకున్నాను కాని,
నీవులేని జీవితంలో నన్ను కోల్పోయానని గుర్తించలేకపోయాను.

నలుగురితో వుంటే, నవ్వుతూ వుంటే ఒంటరితనాన్ని,విరహాన్ని అధిగమిస్తాను అనుకున్నాను కాని,
నువ్వు లేకపోతేనే అది ఒంటరితనమని, నువ్వు దూరమైతేనే అది విరహమని గ్రహించలేకపోయాను.


ఈ క్షణం నువ్వు తిరిగిరావాని తెలిసినా, నువ్వు లేని నా జీవితం శూన్యమని తెలిసినా,
నేను పడే ఈ బాధే ప్రేమని, నేను దూరం చేసుకున్న నువ్వే నా ప్రాణమని నీకు చెప్పాలనే నా చివరి కోరిక...... 

రెప్పలు చాటున దాగిన అందంతో....
పెదవుల మాటున దర్శించిన దరహాసంతో....
చూసిన నిన్ను వర్ణిద్దామంటే మనసు మాటని మౌనం కప్పేస్తుంది....
రాసిద్దామంటే  భిడియమేదో అక్షరాన్ని ఆపేస్తుంది...

ఆశగా అడగగా మౌనం మన్నించి, భిడియాన్ని బంధించగా
హృదయబృంధావనం నుండి విరిసిన ఒకే ఒక్క భావపుష్పం

(నీ వికాసిత నయనాలతో నా మనసుని రమించిన ఓ చెలి,
ఒక్క సారి నీ మనొశికరం నుండి నా ప్రేమ సెలయేరుని జారనివ్వు....
ఆ ప్రేమజలపాతపు హోరులో నా గుండెచప్పుడు విను,
క్షణంకో కోటిసార్లూ నీ పేరే స్మరిస్తుంటుంది,
ప్రతి భిందువులోను నీ రూపే ప్రతిభింభిస్తుంది.)