ఆదమరచి జగతి నిదురించు వేళ నీ తలపులు మదిలొ తచ్చటలాడుతూ నన్ను కవ్విస్తుంటే,

నింగిలోని చందమామ తన మోముపై నీరూపాన్ని పులుముకొని నన్ను ఆటపట్టిస్తుంటే,


చల్లని చిరుగాలులు నీ చిరునవ్వును మోసుకొచ్చి నన్ను వెక్కిరిస్తుంటే,


ఇంటి ముందు మల్లెపందిరి నీ శ్వాసను పరిమళంగా మార్చి నన్ను పిచ్చివాడిని చేస్తుంటే,


నిశిరాత్రి ఐనా నీ ఊహలు మదిలో ఊయలూగుతుంటే,


నిన్ను నింపుకున్న కన్నులకు నిదుర కరువే కదా చెలి.

4 comments:

sandhya said...

కనులకు నిదుర కరువైనా కనుపాపలలో తను హాయిగా నిదిరిస్తున్న దన్న ఆనందం చాలు ,
nice andi chala baga rasaru, good one keep it up.

మనసు said...

బాగుంది, మీ విశ్లేషణ బాగుంది ముఖ్యంగా

పరిమళం said...

అందమైన కవిత ...అందమైన చిత్రం ! బహుశా ఆమెలోనూ విరహం విషాదాన్ని నింపినట్టుంది !

నరసింహ మూర్తి said...

"ఇంటి ముందు మల్లెపందిరి నీ శ్వాసను పరిమళంగా మార్చి నన్ను పిచ్చివాడిని చేస్తుంటే "
I am feeling the blossom..............

Post a Comment