నువ్వు నేనైన నేను, నేను నువ్వైన నీకు,

నన్ను కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి,

రాస్తున్న ప్రేమలేఖ,

నేనైన నీకు నన్ను మరవద్దని,

నిన్ను నువ్వు వదులుకోవద్దని,

నన్ను నీలొ కలుపుకొని నిన్నుగా మార్చిన నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.

మొన్న నేను నేనుగా ఉన్నాను,

నిన్న నేను నిన్ను చూసాను,

నన్ను నేను మర్చిపొయాను,

నిన్ను నాలో కలుపుకొని నేను నువ్వుగా మారిపొయాను,

కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని నిన్ను నన్నుగా కాకుండ,

నీలాగానే మిగిలిపొయావు,

నిన్ను నువ్వు నీలో నన్ను కలుపుకోని నన్నుగా ఎప్పటికి మార్చుకుంటావు,

ఎప్పటికైనా నువ్వు నేనుగా మారతావని ఎదురుచూస్తూ నువ్వైన నేను.

3 comments:

రాధిక said...

నువ్వు - నేను
నువ్వైన నేను
చాలా బాగుంది.

హను said...

సర్వదా మీకు కృతజ్ఞుడిని,మీకు నా కవిత నచ్చిందంటే నేను చాలా అదృష్టవంతుడిని.మీ అమూల్యమైన స్పందనకు ఎంతో ఆనందిస్తున్నాను.

మరువం ఉష said...

ఏమిటో హృదయాన్ని పిండే ఆర్ధ్రత. ప్రేమకి ఇలా పట్టి పీఢించటం ఒక వినోదం. వదలదు, కలపదు.

Post a Comment