కదలిరండి... కదలిరండి...

బ్రతుకు భారమై బ్రతుకుతున్న ప్రజలకు సేవచెయ్యటానికి,

స్వార్ధమనే మత్తులో నిదురపొతున్న మానవులని మేల్కొల్పటానికి,

కదలిరండి... కదలిరండి...

అనాధల ఆకలి తీర్చే అభయహస్తమై,

దారీద్ర్యాన్ని రూపుమాపే సైనికులై,

కదలిరండి... కదలిరండి...

మతాలను మరచి , కులాలను విడచి ఐకమత్యాన్ని చాటటానికి,

భారతీయలంతా అనదమ్ములమని ఏకఖంఠంతో తెలియజేయటానికి,

కదలిరండి... కదలిరండి...

పేదవాడి కన్నీటిని తుడవటానికి,

ఆకలి మంటలని అంతం చెయ్యటానికి,

కదలిరండి... కదలిరండి...

జనసంద్రంలో మంచితనపు నావను నడిపే నావికులై,

ప్రేమను పంచటానికి బయలుజేరే బాటసారులై,

కదలిరండి... కదలిరండి...

2 comments:

మరువం ఉష said...

ఇటువంటి జాగృతి ప్రతి మనిషికీ కలగాలని ఆశిస్తూ, ముందడుగు వేసే వంటరే దృఢమైన నాయకుడై పదిమందిని తన బాటన నడపగల సమర్థుడు కావాలని ప్రార్థిస్తూ..

ఆత్రేయ కొండూరు said...

ఆయనే ఉంటే మంగలాడితో పనేమిటని సామెత.

Post a Comment