నా ప్రేమకు ప్రేరణ నువ్వు,

నా గుండెకి ఊపిరి నువ్వు,

ఎదను గెలవాలన్న,

వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,

ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,

ప్రేమ నేరమా మరి,

ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.

నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,

నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,

అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,

మనసుని వేధించే బాధ,

ప్రేమ అంటే బాధేనా,

మనసు మనల్ని మరచి,

మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?

నన్ను నన్నుగా వుండనీయదెందుకు?

నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?

నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?

ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,

తెలిసి నువ్వు నాకు చేరువవవు,

ప్రేమ నన్ను వదిలేయి,

తనని నా నుండి దూరం చెయ్యి,

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,

ఇక తట్టుకోలేను నన్ను వదిలి వెళ్ళిపో.

నీ ప్రేమ నన్ను ఒంటరిని చేసింది నీ ఆలొచనలతో,

క్షణక్షణం గుండెలో రగిలే అగ్నిజ్వాలలతో నా మనసు మండుతున్నట్లుంది,

నీ చూపులు కరువై నా కన్నులకి అంధకారం అలుముకుంది,

ప్రేమిస్తున్నాననే మాటని పెదవులు నుండి దాటించలేకపోయాను,

నా ప్రేమభావనని నీ మనసులో చేర్చలేకపోయాను,

కాలం నిన్ను నాతో కలుపుతుందనుకున్నాను,

కాని నీ చేతులతో శుభలేఖ అందుకున్న నాకు,

ఒక్కసారిగా గుండెలొ రగిలే అగ్నిపర్వతం పేలింది,

కన్నీటిలావా గుండెలోతుల నుండి బయటకోస్తుంది,

కన్నీటిగోడలతో ఎదురుగావున్న నీ రూపం మసక బారుతుంది,

లోకం మొత్తం చీకటయ్యింది,గుండె వేగం తగ్గుతూవుంది,

శుభలేఖ చేజారింది, తుదిశ్వాసతో గుండె ఆగిపోయింది,

మరణం నాకు చేరువయ్యింది, ప్రేమ నాకు దూరమయ్యింది.

నీ తలపులు తన కోసమే అని తెలుసు,

నీ గుండెలో నిండినది తన ప్రేమేనని తెలుసు,

కాని మనసు మాట విడటం లేదు,

నిన్ను అది మరవటం లేదు,

నీ మనసుని తనకు పంచి తన ప్రేమను స్వీకరించావని తెలిసి కూడ,

నీ మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,

నీ మనసు ఎడారిలో ప్రేమ దాహం తీర్చుకోవాలనుకుంటుంది,

వినవా మనసా తానిక మనకు దక్కదని అంటే,

కనీసం తన ఆనందంలో నన్నా నా ప్రేమను చూసుకుంటానూని అంటుంది,

ప్రేమ దొరకకపొయినా ప్రేయసిని చూస్తూ గడిపేస్తానంటుంది,

కన్నీటి జ్వాలలు మనసుని కాల్చేస్తున్నా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంది.

కారణాలు తెలియవు నాకు,

నీ కన్నుల కాంతి చూడగానే నా మోముపై ఎందుకు ఆహ్లాదం ప్రకాశిస్తుందో,

నీ చిరునవ్వుల పువ్వులకి నా మనసు ఎందుకు పరిమళిస్తుందో,

మనసెందుకు నిన్ను కోరుకుంటుందో,

కనులెందుకు నిన్ను తన కౌగిలిలొ బంధించాలనుకుంటున్నాయో,

నాలో ప్రతి అణువు నీకోసం ఎందుకు పరితపిస్తున్నాయో,

తెలియని భారమేదో గుండెను బాధపెడుతుందెందుకో,

చెప్పలేను చెలి కారణాలని,

చెరుపలేను సఖి నీ జ్ఞాపకాలని,

ప్రేమించలేను నేస్తమా,

ప్రేమించానని నువ్వు చెప్పినప్పుడు ఏమిచెప్పాలో తెలియలేదు,

స్నేహంగా నిన్ను చూసిన నాకు ఆ భావన కలగలేదు,

నా మౌనం అంగీకారం కాదు నేస్తమా,

నీకు సమాదనం చెప్పే దైర్యం లేక నా మనసు మూగబొయింది,

నేను ప్రేమించలేదని నీకు చెప్పినపుడు నువ్వు పడ్డ బాధ నా మనసుని గాయపరిచింది
.
నా ప్రేమ దొరకక నీ కన్నుల నుండి జారిపడ్డ కన్నీరు ఇంకా తడి ఆరక నా పాదలపై మెరుస్తుంది,

ఎరుపెక్కిన నీ కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది.

మూగబోయిన నీ స్వరపు మౌనరాగం నా గుండెను గాయం చేస్తుంది,

ఎలా తెలుపను నేస్తమా నా స్నేహభావాన్ని,

ప్రేమను స్వీకరించలేక,స్నేహన్ని దూరం చేసుకోలేక నేను,

స్నేహాన్ని వదులుకోలేక,ప్రేమను పొందలేక నువ్వు,

మౌనపుసంద్రానికి చేరో ఒడ్డున నిలిచిపొయాము.

నేస్తమా ఎలా సమాధాన పరచాలి నిన్ను?

నువ్వు నేనైన నేను, నేను నువ్వైన నీకు,

నన్ను కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి,

రాస్తున్న ప్రేమలేఖ,

నేనైన నీకు నన్ను మరవద్దని,

నిన్ను నువ్వు వదులుకోవద్దని,

నన్ను నీలొ కలుపుకొని నిన్నుగా మార్చిన నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.

మొన్న నేను నేనుగా ఉన్నాను,

నిన్న నేను నిన్ను చూసాను,

నన్ను నేను మర్చిపొయాను,

నిన్ను నాలో కలుపుకొని నేను నువ్వుగా మారిపొయాను,

కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని నిన్ను నన్నుగా కాకుండ,

నీలాగానే మిగిలిపొయావు,

నిన్ను నువ్వు నీలో నన్ను కలుపుకోని నన్నుగా ఎప్పటికి మార్చుకుంటావు,

ఎప్పటికైనా నువ్వు నేనుగా మారతావని ఎదురుచూస్తూ నువ్వైన నేను.

నా మది నింగిలోని జాబిలి మాయమయ్యింది,

నా ఆనందపు వెన్నెల కరువై చీకటి మిగిలింది,

మన తీపి అనుభూతులు జ్ఞాపకాలుగా మారాయి,

ఆ జ్ఞాపకలు నా హృదయమేఘంలో కలిసిపొయాయి,

నీ జ్ఞాపకాలతో ఆ మేఘం నిండిపొయింది,

ఇప్పుడు నీ చూపుల కాంతులు మెరుస్తున్నాయి,

నీ చిరునవ్వుల చిరుగాలిలా వీస్తునాయి,

ఆ చిరుగాలికి నా హృదయమేఘం కరిగి ఆనంధభాష్పాలు రాల్చింది.


ప్రేమతో మనసుని గెలిచి,

మనువుతో నిన్ను వలచి,

ఆనందాలను అందించాలని ఆశతో,

ప్రేమను పంచాలనే ప్రాయాసలో,

భాద్యతలు బరువై,ఆనందాలు ఆవిరై,

నీ నుండి దూరమై,

సంపాదన అనే చట్రంలో బంధీనై,

ఓంటరిగా వేదన చెందుతూ ఆలోచిస్తున్నా,

ఒక్కసారి అన్న భాద్యతల బంధీఖానా నుండి వీముక్తుడనై,

మళ్ళీ నీకు ప్రేమను పంచే ప్రేమికుడిగా మారాలని!!!



కదలిరండి... కదలిరండి...

బ్రతుకు భారమై బ్రతుకుతున్న ప్రజలకు సేవచెయ్యటానికి,

స్వార్ధమనే మత్తులో నిదురపొతున్న మానవులని మేల్కొల్పటానికి,

కదలిరండి... కదలిరండి...

అనాధల ఆకలి తీర్చే అభయహస్తమై,

దారీద్ర్యాన్ని రూపుమాపే సైనికులై,

కదలిరండి... కదలిరండి...

మతాలను మరచి , కులాలను విడచి ఐకమత్యాన్ని చాటటానికి,

భారతీయలంతా అనదమ్ములమని ఏకఖంఠంతో తెలియజేయటానికి,

కదలిరండి... కదలిరండి...

పేదవాడి కన్నీటిని తుడవటానికి,

ఆకలి మంటలని అంతం చెయ్యటానికి,

కదలిరండి... కదలిరండి...

జనసంద్రంలో మంచితనపు నావను నడిపే నావికులై,

ప్రేమను పంచటానికి బయలుజేరే బాటసారులై,

కదలిరండి... కదలిరండి...


నాకోసం వెతకటమే తెలుసు నీ కళ్ళకి,

కాని ఆ కళ్ళలొ ప్రేమను ఆశ్వాదిస్తున్న నా చూపులు తనకి కనబడవు.

నావెంట నడవటమే తెలుసు నీ పాదాలకి,

కాని ఆ పాదాలు కందకూడదని పూలమార్గం వేసింది నేనేనని తెలియదు వాటికి.

నా చిరునవ్వులలో ఆనందం వెతకటమే తెలుసు నీ చూపులకి,

కాని నీకు ఆనందన్ని అందించటానికి నా చిరునవ్వులు చిందిస్తున్నాని తెలియదు వాటికి.

నా ప్రేమను పొందడానికి ఆరాటపడడమే తెలుసు నీకు,

కాని నీ ప్రేమను పొందాలని ఆవేదన పడుతున్న సంగతి తెలియదు నీకు.

మాటలు చెప్పాలనే తెలుసు నీ గుండెకి,

కాని నీ మౌనం నన్ను బాధిస్తున్నదని తెలియదు నీకు.

ప్రేమను పంచాలనే తెలుసు నీ మనసుకి,

కాని నీ ప్రేమను పొందాలని ఆశపడుతున్న నా మనసు వేదన తెలియదు నీకు.

నా మౌనాన్ని పోగరనుకున్నావు,

కాని నా చూపుల మాటలను వినిపించుకోలేక పోయావు.

మగువ మనసుని చదవలేని మాగాడివయ్యావు నువ్వు,

మనసులోని భావాలను బయటపెట్టలేని మగువనయ్యాను నేను.

నాటి నా భాగ్యనగరం:-

చారిత్రాత్మక ప్రదేశాల కేంద్రబిందువు నా భాగ్యనగరం,

సభ్యమత సమైక్యతకి చిరునామా నా భాగ్యనగరం,

వలస వచ్చిన ప్రజలను ఓడిలో దాచుకున్న భూమాత నా భాగ్యనగరం,

పొట్టకూటికోసం వచ్చిన వారికి ఆకలి తీర్చిన మాతృమూర్తి నా భాగ్యనగరం,

సాగరన్ని గుండెలో దాచుకొని సౌదర్యపు సొగసరి నా భాగ్యనగరం,

నేటి నా భాగ్యనగరం:-

పెద్దపెద్ద భవనాల పునాధులను గుండెలొ గుచ్చుకుంటుంది నా భాగ్యనగరం,

పేదప్రజలకు గజంభూమి అందనంత ఎత్తుకెగసింది నా భాగ్యనగరం,

ఉగ్రవాదుల అగ్రనిలయం నా భాగ్యనగరం,

క్షణక్షణం భయాందోళనలో మునిగిపొయింది నా భాగ్యనగరం,

కులమతాల చిచ్చులో మండిపోతుంది నా భాగ్యనగరం,

ఘడియ ఘడియకి పేలుతున్న బాంబులతో కాలిపొతుంది నా భాగ్యనగరం,

నాడు అది భాగ్యనగరం నేడు అది దౌర్భాగ్యనగరం.

నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,

నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మానవత్వం,

కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,

మనుషులని చంపటం మేము నేర్చుకున్న మానవత్వం,

ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మనవత్వం,

ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మానవత్వం,

మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,

మా దేశం నేర్పిన పాఠం ఇదే,

మా మనుషులు నడిచే బాట ఇదే.

ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,

ఇదే మేము నేర్చుకున్న మానవత్వం,

మా నవతకు నేర్పుతున్న మానవత్వం.

మృత్యుకౌగిలిలో బిగుసుకుంటున్నాను,

మరణ సెయ్యపైకి ఎక్కబోతున్నాను,

చావు నాకు చేరువగా కనబడుతుంది,

కన్నుల ముందున్న నీ రూపం మసకబారుతోంది,

తోడుగా ఉన్న నీ చెయ్యి నా నుండి జారిపోతుంది,

నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు నా గుండెపై పడుతున్నాయి,

కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,

మనసు లేని ఆ శిల్పం(ధైవం) నన్ను నీ నుండి దూరం చెయ్యాలనుకుంటుంది.

మరణం వైపు నా ప్రయాణం ప్రారంభమయ్యింది,

ఐనా కాని నీ ఓడిలో మరణం నాకు ఆనందమే,

వెళ్ళిపోతున్నా ప్రియతమా మనసుని నీకు వదిలేసి.

ఉదయపు భానుడి నునువెచ్చని కిరణాలను తాకాలని నన్ను నిద్దురలేపుతావు,

తొలిమంచు బిందువులలో తడుస్తూ ఆనందాన్ని ఆశ్వాదిద్దామంటావు,

సెలయేటి నీళ్ళలో ఈత కొడదామంటావు,

తన రాకకోసం ఎదురుచూడమంటావు,

తన అడుగులకి నా అడుగులు జత కలపమంటావు,

తన చిరునవ్వుల అందాలని వద్దన్నా చూపిస్తావు,

అవసరం కల్పించిమరీ తనతో మాట్లాడిస్తావు,

తనని ప్రేమించమని వేదిస్తుంటావు,

నాకు తెలియకుండానే తనని ఇష్టపడేలా నన్ను మార్చేస్తుంటావు,

నా దానివని ఊరుకుంటే నా మాటే వినడం మానేశావు,

ప్రతిక్షణం తన గురించి ఆలోచిస్తూ తన పక్షం చేరిపొయావు,

నా మనసు వయ్యుండి నన్నే బాధపెడుతున్నావు,

ఓ మనసా ! ! ! అసలు నీకు మనసంటూ ఉందా?

ఉంటే మరి ఎందుకు తనని ప్రేమించమని నాతో వాదన పడుతున్నావు,

ఎందుకు నన్ను వేదన పెడుతున్నావు.



నా మనసుకి నీ చూపుల కిరణాలు తగలక తెలవరలేదంటుంది,

నిన్నటిదాక వినిపించే నీ మాటలు ఒక్కసారిగా మాయమయ్యాయి.

మాయమైన ఉదయపు వెన్నెల కోసం నా కన్నులు వెదకసాగాయి,


వెంటనడిచే జంటనీడ కోసం నా అడుగులు బయలుజేరాయి,


విరహాంధకారంలో
ఒంటరినై రోదిస్తున్నాను,


నీ
ప్రేమతో నా మనసు
లో చిరునవ్వుల జ్యొతులని వెలిగించలేవా!!

మొన్నే నిన్ను చూసినట్లుంది,తొలిచూపులొనే నా మనసుకి ప్రేమను తెలియజేశావు.
నన్ను అడగకుండానే నా మనసులొకి ప్రవేశించావు,
నా మీద నాకున్న ఆత్మవిస్వాసాన్ని మాయం చేశావు,
నా గురించి మానేసి నీ గురించి ఆలొచించేలా చేశావు.
ఎన్ని రోజులు తిరిగాను నీకు నా ప్రేమను తెలియజేయటానికి,
ఎన్ని సార్లు ప్రయత్నించాను నీ కళ్ళలొ కళ్ళు పెట్టి దైర్యంగా చూడటానికి,
ఎన్ని ప్రేమలేఖలు రాశాను, నా ప్రేమను వ్యక్తం చెయ్యటానికి,
ఎన్ని ప్రయత్నాలు చేశాను నీ అంగీకారం కోసం,
ఇప్పుడూ నువ్వు ఒక్కసారిగా నా ప్రేమను అంగీకరించేటప్పటికి,
నా మనసుమధనం జరిగి కన్నీళ్ళు ఆనందభాష్పాలుగా మారాయీ.
నన్ను ప్రేమించావని ఆనందించాను, నన్ను ఆరధించావని పొంగిపొయాను,
నాతొ జీవితమంతా గడుపుతానంటే ఎగిరి గంతేసాను,
ఆ వసంతమే నా వాకిట్లొకి వచ్చినంతా అనుభూతి కలిగింది,
గుండెలొ మంచుజల్లు పడినంత హాయిగా వుంది,
ఆ వేటూరిగారికే నే పాట రాసినంత ఆనందంగా వుంది.
ఓ చిన్నారిపాప తన చిరునవ్వు నాకు ప్రసాదించినట్లుంది,
నీ ప్రేమవసంతం చూసి నా మనసులొ కొయిల పాట పాడినట్లుంది
ఆ జాబ్బిల్లి నా మనసుని తాకినట్లుంది,
కాలమంతా ఆ క్షణంతొ ఆగిపొయినట్లుంది,
కొత్త జన్మగా మళ్ళీ పుట్టినట్లుంది
మొన్నటి దాకా నీ ప్రేమ కోసం పడ్డ కష్టాలన్ని ఒక్కసారిగా మర్చిపొయాను,
ఇప్పుడిప్పుడే కదా నీ ప్రేమలొ ఉన్న మాధుర్యాన్ని చూస్తున్నాను,
ఇప్పుడే కదా నా ప్రేమని నీకు తెలియజేస్తున్నాను,
మరి అంతలోనే నన్ను,ఈ లోకాన్ని వదిలి ఎలా వెళ్ళిపొయావు,
జీవితాంతం నాతొ కలిసుంటానని నాకు చేసిన ప్రమాణం అబద్దమేనా,
నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయావే నీకు నా మీద ప్రేమలేదా,
ఇదేంటి మొన్నటి దాకా తను కాదన్న రాని కన్నీళ్లు ఇప్పుడు ఒక్కసారిగా తన్నుకొస్తున్నాయీ,
ఒక వేళ గుండెలొ దాచుకున్న నీ రూపం కూడ కరిగిపొయిందా,
లేక నా గుండె పగిలి ఆ రక్తం కన్నీళ్ళగా మారిందా,
ప్రేమలొ ఎంత ఆనందముందో అంత కన్నా ఎక్కువ భాద కూడ వుంది
ఏదైనా చేస్తానని నీకు చేసిన ప్రమాణం గుర్తొచ్చి నన్ను ఇంకా బాధ పెడుతొంది,
నిన్నే కాపాడుకొలేకపొయాను ఇంక నా ప్రమాణానికి విలువేమిటని,
కాని నీ ప్రేమ నిజం అందుకే అదింకా నా గుండెలొనే వుంది,
కాని నువ్వు లేని నేను ఎలా బ్రతికుండగలను,
ప్రాణం పోతేనే మనిషి చనిపొయినట్లు కాదు,
మనసు చనిపొయిన మనిషి కూడా బ్రతికున్నా చనిపొయినట్లే.
ఎవరొ గుండెను కొస్తున్నట్లుంది, ఏదొ శక్తి నన్ను దహించివేస్తున్నట్లుంది
ఇంకా నేనెందుకు బ్రతికున్నానా అని నా మీద నాకే సిగ్గేస్తుంది.
నీకొసం ఏం చెయ్యలేక నన్ను నేనే ఛీదరించుకుంటున్నాను,
నా ప్రేమతొ ఆ కాలన్ని వెనక్కి తిప్పాలనిపిస్తొంది, నిన్ను బ్రతికించుకొవాలనిపిస్తొంది,
నా గుండెలొని బాదను ఏ దేవుడికి వినిపించాలి,
ఏ దేవతను అర్దించాలి, నిన్ను మళ్ళీ నా దగ్గరకు చేర్చమని,
ఐనా నా పిచ్చి గాని అంత మనసే ఆ దేవుడికుంటే నిన్ను నా నుండి దూరంచేస్తాడా?
అవునులే సృష్టించటమే కాని ప్రేమించటం తెలియని ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు,
మొన్నటి దాకా దేవుడి విగ్రహమే రాయనుకున్నా,
అతని మనసు కూడా రాయే, మరి నేను ఎవరిని అడగాలి తనను తిరిగి పంపమని,
తనకు ప్రాణం పొయ్యమని,నా మనసుని బ్రతికించమని
నీ జ్ఞాపకాలు ఒక్కొక్కటే నన్ను వెంటాడూతున్నయీ,
నిన్నటి దాక తిరిగిన ప్రదేశాలు నువ్వెక్కడని అడుగుతున్నయీ.
నీ తలపులలొ బ్రతికేద్దామనుకున్నాను,కాని ఆ తలపులే నన్ను బాదపెడుతున్నయీ.
తీపిగుర్తులుగా వుంటాయని మనం రాసుకున్న కవితలే ఇప్పుడు నా మనసుని కాల్చేస్తున్నాయీ.
నువ్వు చనిపొయి సంవత్సరాలు గడుస్తున్న నా మనసు మాత్రం నిన్నలొనే ఆగిపొయింది.
నీ ప్రేమే ఇంకా నా గుండెను కొట్టిస్తొంది, నీ ఉహాలే నాకు ఊపిరినిస్తున్నయీ.
నువ్వు చనిపొయినా నన్ను బ్రతికిస్తున్నావు, నీది నిజమైన ప్రేమ ,
కాని నువ్వు చనిపొయినా బ్రతికున్న నేను నిజమైన ప్రేమికుడినేనా?
ఇప్పుడు నేను మనసులేని మనిషిని, లేకపొతే నువ్వు చనిపొయినా నేనెలా బ్రతికుంటాను.
నాది నిజమైన ప్రేమేనా, నువ్వు ఒక్కసారి చనిపొయి నన్ను నీ ప్రేమతొ రొజు చంపుతున్నావు కదా,
ఎందుకు నాకీ శిక్ష. ఐనా తప్పు నాదేలే నిన్ను బ్రతికించుకొలేకపొయ్యాను.
ప్రేమలోని మాధుర్యాన్ని చూసేలోపే,దూరంలోని కాఠిన్యాన్ని చూపించావు,
చావురాక, బ్రతకటం ఇష్టంలేక నరకాన్ని అనుభవిస్తున్నాను,
ఆ మరణం కూడ నన్ను మోసం చేస్తుంది,నన్ను నీ దగ్గరకు చేర్చకుండా.
అందుకే నీ చెంత చేరటానికి ఆ మరణం కోసం ఎదురుచుస్తున్నాను.




ఆ మరణం కోసం ఎదురుచూస్తున్నా నీ . . . . .
నేను



నీ కన్నుల నాట్యానికి నా మనసు వేణువు అయ్యి స్వరాలు పలుకుతుంది.

నీ నవ్వుల తన్మయత్వానికి నా ప్రాణం వాయువు అయ్యి నీ గుండెలొ చేరిపొయింది.

పారుతున్న సెలయేరులా ఉన్న నీ కురులలొ నా చూపులు చిక్కుకుపొయాయి.

నీ ప్రేమని ప్రాణంగా మార్చి నన్ను బ్రతికించమన్నాను,

నా మనసుని హారతిగా చేసి నిన్ను కోలుస్తున్నాను.

ఈ ప్రేమికుడిని కరుణించి నా గుండె గుడిలొ కొలువుండిపొవా !!!!!

నీ ఉహలు నా మనసుకి స్వల్పానందం,

నీ ఉసులు నా హృదయానికి క్షణికానందం,

కాని నాకు కావలసింది నీ ఉహలు కాదు నీవు దక్కవేమో అనుకోవటానికి,

నీ ఊసులు కూడ కాదు నీకు దూరంగా గడపటానికి,

నాకు కావలసింది నాతో జీవితాన్ని గడిపే నువ్వూ,నీ ప్రేమ

క్షణికంగానో, స్వల్పంగానో కాదు శాస్వతంగా.

చిన్న చిరునవ్వుతో నీ గుండె చెరలొ బంధించావే,

ప్రేమగా మారి మనసులో చేరకపొయినా,

జ్ఞాపకమై నా గుండెలొ చేరావు,

మౌనన్ని మంత్రంగా వేసి మాయచేసి మరలిపొతున్నావు,

జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.

నీ మాటలతో మౌనం కరిగేదెప్పుడు,

నీ ప్రేమతో నా గాయం మానేదెప్పుడు.

నీశీదిలో కదిలే మేఘనికి తెలుసు నీటి బరువు,

నామదిలో మెదిలే ప్రేమకు తెలుసు కన్నీటి బరువు.

నిన్ను ప్రతిబింబంగా మార్చి నా కనుపాపలో దాచుకున్నాను,

కాని నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు.

ప్రేమను పంచుతానంటే నమ్మనంటున్నావు,

ప్రాణం అర్పిస్తానంటే నవ్వుకుంటునావు,

నా ప్రేమ విలువ నీ చిరుకోపమా?

లేక నా ప్రాణం విలువ నీ పరిహాసమా?